పల్లే టూరి ఎంకి,
కోడీ కూసె ఏల,
పిల్లా పైర గాలి,
పచ్చా వరీ చేలొ,
నీటీ ఊట కాడ,
కడవా నెత్తినెట్టి,
గల్లూ గల్లు మంటు,
మువ్వా సవ్వాడిల,
కుహూ కుహు మంటు,
కోకీలమ్మ లాగ,
చిలకా మాటలతో,
నెమలీ నడక తోటి,
పావు రాయి చూపు,
హంసా వంటి రూపు,
పొలము గట్టు ఎంట,
పాటా పాడుకుంట,
కొప్పూల జాజుల్లు దోపి,
వయ్యారి నడుమూను ఊపి,
చెంగు మంటు వేసేటి నడక,
ముక్కూన గుండ్రాని పుడక,
చెవులకు బంగారు దుద్దు,
నిలువెత్తు అందాన్ని చూడు,
ఓ పల్లెటూరి ఎంకి పిల్ల....!
అందమంత నీది మల్ల...!
చూసి కూడ ఆగేదేలా....?
.............. కళ్యాణ్ ;)