Thursday, January 15, 2015

sankranthi subhakankshalu

సంక్రాంతి శుభాకాంక్షలు ............ !

@ భోగి  కనుమ ల సంక్రాంతి,
ఇంటింటా వెలిగిన పండగ కాంతి....!

@ పాడి పంటల పరవళ్ళు,
పిల్ల గాలుల చిరు జల్లు....!

@ రంగు రంగుల గాలిపటాలు ,
గంతులేసే గంగిరెద్దులు ....!

@ హరిదాసు ల ఆట పాటలు,
ముంగిట్లో ముగ్గుల హరివిల్లు.....!

@ విర బూసిన పూల మొగ్గలు,
కన్నె పిల్లల సిగ్గులు.....!

@ భోగి పళ్ళ లో చిన్న పిల్లలు,
పట్టు చీరలు, జరీ పంచెలు.....!

@ కొత్త అల్లుళ్ళ కోలాహలం,
కొంటె మరదళ్ల చిలిపి తనం.....!

@ ఇంటింటా రుస రుసలు,
ఇరుగు పొరుగు  గుసగుసలు....!

@ రంకెలేసే కాడెద్దులు,
కాలు దువ్వే పందెం కోళ్ళు......! 

@ ఆట పాటల తిరునాళ్ళు,
ఆటలాడే పేకాట రాయళ్ళు......!

@ పగలంతా భజన తాళం,
రాతిరైతే బోగం మేళం.......!

........... కళ్యాణ్  ;) 

No comments:

Post a Comment