పండగల్లె పరికిణి లో ,
నవ్వుతుంటే నెలవంక !
రాలిపోవ సిరి ముత్యాలు ,
ఏరుకోను ఈ జన్మ చాలు .
అచ్చ తెలుగు అందం ,
అమ్మాయి రూపం .
నీలి కనుల వీక్షణం ,
వాలు కనుల వయ్యారం .
ఎర్రటి నీ ఆధారాలు ,
ఆవడ లా నీ బుగ్గలు .
ముద్దొచ్చే నీ పలుకులు ,
బుంగ మూతిలో నీ అలుకలు .
శంఖమంటి మెడ,
పూలతల వాలు జడ .
పసిడి వన్నె పరువాలు ,
పరవశింప జేయి యవ్వనాలు.
నడుము వంపు సోయగాలు ,
నీ సొంతం నెమలి నడకలు .
నీ ఒడిలో దివి సీమ ,
నేను చేరితే కలవరమా ?
కోటి కాంతుల పారిజాతమ ,
నా జన్మల పుణ్య ఫలమా...
నీ ప్రేమకు బానిసని ,
కాదనకే దొరసాని ..!
అంద చందాల యువ రాణి ,
నా ప్రేమ సామ్రాజ్యానికి నువ్వే 'మహా రాణి' .....!
.... కళ్యాణ్ ;)
No comments:
Post a Comment