Friday, May 1, 2015

HAPPY MAY DAY

లాల్ సలాం కాంరేడ్స్ ''HAPPY MAY DAY''
కార్మిక సోదరులకు - '' మే డే '' శుభాకాంక్షలు
. . . . . . . . . . . . . . . . . . . . . . . . .
నా పదం అక్షర సత్యం,
నా రచన కల్ప వృక్షం,
నా కవితల అక్షయ పాత్రతో..,
కార్మిక సోదరులకు కనకాభి షేకం. . . . . !
.
పదం పాడి కదం తొక్కి ,
రధం లాగ జనం సాగగా.,
.
పలుగు , పార , నాగలి , నట్టు,
కొడవలి , కావలి, కష్టం, చమట,
మన నేస్తాలు...!
.
ప్రతి రైతు - రగిలే సూర్య ఖణం,
ప్రతి కాంరేడ్ - వెలిగే వేగు చుక్క,
ప్రతి కష్టం - కరిగే చమట చుక్క,
ప్రతి వ్రుత్తి - కనిపించే దైవం.,
.
బతుకు అంతా భారమై,
ప్రాణమున్న కష్ట జీవి,
గుప్పెడైన నీరు లేక,
వలస వెళ్లి పని కోసం,
అలసి పోయి విధి సైతం,
గుప్పెడు మట్టిని బదులిస్తే...!
.
రెక్కల బండిలో తిరిగే ఓ నేతన్నా....!
పేదల డొక్కల ఆకలి తీర్చన్నా....!
.
సువిశాల దేశమా.,
అన్నపూర్ణ భారతమా.,
కష్ట జీవిని ఆదుకోనుమా.......!
.
అడవి లోని 'అన్న'లకు,
అలసి పోయిన 'రైతన్న'లకు,
కష్టపడే 'కార్మికుల'కు,
అసువులు బాసిన 'అమర వీరుల'కు,
.
లాల్ సలాం.....! _/\_
.
........... కళ్యాణ్. 


No comments:

Post a Comment