Friday, July 24, 2015

naa pushkara anubhavam





 


ఉభయ గోదవరి - ఉభయ కుశలోపరి .....!
.
Train లో నుంచే కనిపించాయి ఆ divine పుష్కర ఘాట్ లు .,
ఇసుక వేసినా రాలనంత జనం ! అందరికీ దక్కాలిగా మరి ఆ పుష్కర పుణ్యం .,
గోదారమ్మ ఒడిలో, సెక్యూరిటీ నీడలో సేవలు అందిస్తున్న రాజ మహేంద్ర వరం .,
ధూప దీపాలతో వెలిగి పోతున్న గోదావరి తీరం .,
విద్యుత్ కాంతులతో మెరిసి పోతున్న రాజమండ్రి నగరం .,
వీధి దీపాల తోరణాలు, ఒక్కో వీధిలో ప్రతేక ఘాట్ లు .,
ముక్కోటి దేవతలు కొలువైన కోటి లింగాల ఘాట్ లో స్నానాలు .,
వేద మంత్రాల నమస్కారాలు, పితృ దేవతలకు తర్పణాలు .,
VIP ల పలకరింపులు, ట్రాఫిక్ ఆంక్షలు .,
దూర ప్రయాణాలతో కాసంత ప్రయాసలు .,
సముచిత సదుపాయాలతో కుదుట పడ్డ అలసటలు .,
ఉచిత బస్సు లు, ఊరంతా సేవా కేంద్రాలు .,
సుస్వాగతం తో ఆరంభం మరియాదలు .,
ప్రతి రోజు అతిధులతో ఇంటింటా సంబరాలు .,
అరటి ఆకు సైతం తినేయాలి అనిపించే వంటకాలు .,
కాసంత కునుకు పడితె చాలనిపించే భుక్తాయాసాలు .,
ఉరుకుల పరుగుల తో తిరుగు ప్రయాణాలు .,
ఆలస్యం గా నడుస్తున్న ప్రయాణ సాధనాలు .,
.
మహా పుష్కర వైభోగం లో ఇది నా అనుభవం ....! _/\_
..... కళ్యాణ్ wink emoticon
    

No comments:

Post a Comment