Monday, June 15, 2015

AP schools reopens



ఆకతాయి వయసు వేళ అక్షరాల బాటలోన,
జీవితాన్ని చదవమంటు పుస్తకాలు మూసుకుంటు,
బుర్ర చూస్తే చిటికెడంత - బుర్ర లోకి భారమెంత ?

వస్తాదువా?
రెండెడ్ల బండివా ?
గోవర్ధన గిరిని మూసిన గూవిందుడివా ?

బడిలోకి వెళ్తున్నావా ?  పోరు బరిలోకి వెళ్తున్నావా ?
నిన్ను తీర్చి పంపుతున్న నీ తల్లికి వందనం.

కోరిన చదువులో ? ఎందుకూ కొరగాని చదువులో ?
నిన్ను ఆ స్తాయికి పెంచుతున్న నీ తండ్రికి వందనం.

ఉద్దేశాలను నీపై రుద్డక, ఉపన్యాసాల ఊసే లేక !
ఊపిరంతా నీ ఊహల సాకారం కోసం శ్రమించే నీ గురువుకి వందనం .

తోడుగా ఉంటావో ? తాడో పేడో అంటావో ?
స్నేహానికి సాటి రాదు ఏ బందం. ఆ అనుబందానికి వందనం.

విజయాన్ని అందుకునే వీర కిషోరమా !
విజయ లక్ష్మి నిను వరించు గాక.

.... కళ్యాణ్  ;) 

No comments:

Post a Comment