Wednesday, August 5, 2015

Thank You everyone

ఏమయ్యా బ్రహ్మయ్యా ! బొమ్మ లాగ చేశావు ?
బొమ్మలోడి(తండ్రి) చేతికి బేరమాడి ఇచ్చావు !
జీవితాన్ని వెల చేసి కొన్నది(కన్నది) ఓ బంధం !
బొమ్మకేమో రూపు ఇచ్చి, చక్కదిద్ది, ప్రాణమిస్తే !
ఆ జీవమిచ్చిన బందానికి(అమ్మ) ఏమివ్వగలను...?
...... _/\_ ...... 5th AUGUST
(నాకు జన్మ ఇచ్చిన తల్లి తండ్రులకు నా వందనం )
..... కళ్యాణ్ 


ile emoticon

Friday, July 24, 2015

naa pushkara anubhavam





 


ఉభయ గోదవరి - ఉభయ కుశలోపరి .....!
.
Train లో నుంచే కనిపించాయి ఆ divine పుష్కర ఘాట్ లు .,
ఇసుక వేసినా రాలనంత జనం ! అందరికీ దక్కాలిగా మరి ఆ పుష్కర పుణ్యం .,
గోదారమ్మ ఒడిలో, సెక్యూరిటీ నీడలో సేవలు అందిస్తున్న రాజ మహేంద్ర వరం .,
ధూప దీపాలతో వెలిగి పోతున్న గోదావరి తీరం .,
విద్యుత్ కాంతులతో మెరిసి పోతున్న రాజమండ్రి నగరం .,
వీధి దీపాల తోరణాలు, ఒక్కో వీధిలో ప్రతేక ఘాట్ లు .,
ముక్కోటి దేవతలు కొలువైన కోటి లింగాల ఘాట్ లో స్నానాలు .,
వేద మంత్రాల నమస్కారాలు, పితృ దేవతలకు తర్పణాలు .,
VIP ల పలకరింపులు, ట్రాఫిక్ ఆంక్షలు .,
దూర ప్రయాణాలతో కాసంత ప్రయాసలు .,
సముచిత సదుపాయాలతో కుదుట పడ్డ అలసటలు .,
ఉచిత బస్సు లు, ఊరంతా సేవా కేంద్రాలు .,
సుస్వాగతం తో ఆరంభం మరియాదలు .,
ప్రతి రోజు అతిధులతో ఇంటింటా సంబరాలు .,
అరటి ఆకు సైతం తినేయాలి అనిపించే వంటకాలు .,
కాసంత కునుకు పడితె చాలనిపించే భుక్తాయాసాలు .,
ఉరుకుల పరుగుల తో తిరుగు ప్రయాణాలు .,
ఆలస్యం గా నడుస్తున్న ప్రయాణ సాధనాలు .,
.
మహా పుష్కర వైభోగం లో ఇది నా అనుభవం ....! _/\_
..... కళ్యాణ్ wink emoticon
    

Wednesday, July 22, 2015

naaku nuvvante istam ....!


నిన్ను చేరుకోవాలి అనుకున్న తరుణం చేరువైంది...!
నీతో ఉన్నంత సేపు సమయం త్వరగా గదిచి పోయింది...!
నిన్ను విడిచి వస్తుంటే ప్రాణం ఆగి పోయింది...!
నాలో నువ్వున్నావని అనుకున్నప్పుడల్లా ధైర్యంగా ఉంటుంది..!
కానీ ! పక్కన లేవని అనుకుంటే బాధేస్తుంది...!

కలలా గడిచి పోయింది సమయం..!
నిన్ను కలవరిస్తూ గడిపేస్తా జీవితం...!
 '' నాకు నువ్వంటే ఇష్టం ''
అది చెప్పగలడు కేవలం నా మౌనం ....!

....... ఓ అజ్ఞాత ప్రేమికుడు

.... కళ్యాణ్  ;) 

Friday, June 19, 2015

its you dear

పండగల్లె పరికిణి లో ,
నవ్వుతుంటే నెలవంక !

రాలిపోవ సిరి ముత్యాలు , 
ఏరుకోను ఈ జన్మ చాలు . 

అచ్చ తెలుగు అందం ,  
అమ్మాయి రూపం . 

నీలి కనుల వీక్షణం ,
వాలు కనుల వయ్యారం . 

ఎర్రటి నీ ఆధారాలు ,
ఆవడ లా నీ బుగ్గలు . 

ముద్దొచ్చే నీ పలుకులు , 
బుంగ మూతిలో నీ అలుకలు . 

శంఖమంటి మెడ, 
పూలతల వాలు జడ . 

పసిడి వన్నె పరువాలు , 
పరవశింప జేయి యవ్వనాలు. 

నడుము వంపు సోయగాలు , 
నీ సొంతం నెమలి నడకలు . 

నీ ఒడిలో దివి సీమ , 
నేను చేరితే కలవరమా ? 
కోటి కాంతుల పారిజాతమ , 
నా జన్మల పుణ్య ఫలమా... 

నీ ప్రేమకు బానిసని , 
కాదనకే దొరసాని ..! 

అంద చందాల యువ రాణి , 
నా ప్రేమ సామ్రాజ్యానికి నువ్వే 'మహా రాణి' .....! 

.... కళ్యాణ్ ;)    
నేల మీద వెన్నలమ్మ ...,
కాటుక కళ్ళ బాపు బొమ్మ ...,
లవ్ యు అంటూ కోయిలమ్మ ...,
సోయగాల బుంగ మూతి గుమ్మా ...,


Monday, June 15, 2015

AP schools reopens



ఆకతాయి వయసు వేళ అక్షరాల బాటలోన,
జీవితాన్ని చదవమంటు పుస్తకాలు మూసుకుంటు,
బుర్ర చూస్తే చిటికెడంత - బుర్ర లోకి భారమెంత ?

వస్తాదువా?
రెండెడ్ల బండివా ?
గోవర్ధన గిరిని మూసిన గూవిందుడివా ?

బడిలోకి వెళ్తున్నావా ?  పోరు బరిలోకి వెళ్తున్నావా ?
నిన్ను తీర్చి పంపుతున్న నీ తల్లికి వందనం.

కోరిన చదువులో ? ఎందుకూ కొరగాని చదువులో ?
నిన్ను ఆ స్తాయికి పెంచుతున్న నీ తండ్రికి వందనం.

ఉద్దేశాలను నీపై రుద్డక, ఉపన్యాసాల ఊసే లేక !
ఊపిరంతా నీ ఊహల సాకారం కోసం శ్రమించే నీ గురువుకి వందనం .

తోడుగా ఉంటావో ? తాడో పేడో అంటావో ?
స్నేహానికి సాటి రాదు ఏ బందం. ఆ అనుబందానికి వందనం.

విజయాన్ని అందుకునే వీర కిషోరమా !
విజయ లక్ష్మి నిను వరించు గాక.

.... కళ్యాణ్  ;) 

Friday, June 5, 2015

vijayam

విజయం ........! 

దారి ఏది లేదంటే ! దరికి రాదు ఏ విజయం, 
దారమొకటి కాదు కదా ? సూదితోనె రూపు సాద్యం. 

చీకటని తెలిసి కూడా వెతుకులాట దేనికి ? 
ఏదో ఒక చిరు మార్గం కోసమే నీ ప్రయత్నం. 

సాగనీ ఈ జీవితం, ఊరుకుంటే ఉత్తమం..! 
అని అనుకుంటే ఈ క్షణం, లేదు నీకు గమ్యం. 

యుద్దమందు వెనకుంటే, నిలుచు నీకు ప్రాణాలు. 
పోరాడితే ఒకసారి ఆ ప్రాణానికి దొరుకుతుంది చిరునామా. 

సాయం ఒకటి నీకుంటే సాదించవ ఎదైనా ! 
ఓ తోడు వెంటుంటే గెలువ గలవు ఎపుడైన ! 

పాట గానె కాదు ఇది పాటం గా చదువుకో.  
పాటలన్ని వల్లె వేస్తు జీవితాన్ని గెలుచుకో. 

........... కళ్యాణ్ ;)