Wednesday, February 18, 2015

Happy Valentine's day ****

*కలలో ఓ రాతిరి, కలవరింతలో ఓ సారి,
నువ్వొచ్చావనుకుని కనులు తెరిచా.....!
నిజం తలచి నవ్వుకుని, కళ్ళు తెరిచే నిదుర పోయా.

*నువ్వు తప్ప ఇంకేమీ గుర్తు రావట్లేదు రా నాకు,
ఏంటో ! నా heart beat miss అయినట్లు ఉంది,
నీకు దూరంగా ఉంటే......!

*నా గుండె నిండా నువ్వున్నావ్ అని దైర్యంగా ఉన్నా....!
కానీ ! నా గుండె నీ దెగ్గరే వదిలేసి వచ్చా అని మరచిపోయా.

*ఇప్పుడు ఆ దైర్యం లేదు, ఆ నిదుర లేదు, ఆ కలలు లేవు,
ఆ జ్ఞాపకాలు లేవు, నా ఊపిరి లేదు, నా ప్రాణం లేదు.
(నా ఊపిరి = నీ నవ్వు ; నా ప్రాణం = నువ్వు)

*ఎందుకంటే నువ్వు నా దెగ్గర లేవు ..........! ;(

................ కళ్యాణ్ ;)

19th February , my valentine day

Saturday, January 24, 2015

MISS YOU ****

MISS YOU ****

#ఎంత అందంగా చూసుకున్నాను నా కల లో నిన్ను....,
#ఎంత గొప్పగా రాసుకున్నాను మన జీవన కావ్యం....,
#ఎంత అందం, ఏమి భాగ్యం , అంత లోనే మదికి  దూరం....,
#వెలుతురొచ్చినా, వెతికి చూసినా కానరాదు ఇపుడు నీ రూపం....,
#నీ జ్ఞాపకాలు అన్నీ కలిపి నా కన్నీటితో కథగా రాశా....,
#నా కలల కానుక, నా కావ్య దేవత, నా కథా నాయిక....,
#నీకు అంకితం అని ముగించాలనుంది నా జీవితం....,

#నా కనీళ్ళు ఇమికి పోయాయి............!

#ఇక రెప్ప తెరిచి ఎదురు చూసినా.....!
#రేయి అంత నిన్ను తలిచినా.....!
#రక్తం తో చిరునామా రాసినా.....!

@ నా ప్రేమ నీవు అందుకోలేవు.
@ నీ చేయి నేను అందుకోలేను.

MISS YOU ****
(in fact missing myself)*

..............నీ కళ్యాణ్ ;(

Thursday, January 15, 2015

sankranthi subhakankshalu

సంక్రాంతి శుభాకాంక్షలు ............ !

@ భోగి  కనుమ ల సంక్రాంతి,
ఇంటింటా వెలిగిన పండగ కాంతి....!

@ పాడి పంటల పరవళ్ళు,
పిల్ల గాలుల చిరు జల్లు....!

@ రంగు రంగుల గాలిపటాలు ,
గంతులేసే గంగిరెద్దులు ....!

@ హరిదాసు ల ఆట పాటలు,
ముంగిట్లో ముగ్గుల హరివిల్లు.....!

@ విర బూసిన పూల మొగ్గలు,
కన్నె పిల్లల సిగ్గులు.....!

@ భోగి పళ్ళ లో చిన్న పిల్లలు,
పట్టు చీరలు, జరీ పంచెలు.....!

@ కొత్త అల్లుళ్ళ కోలాహలం,
కొంటె మరదళ్ల చిలిపి తనం.....!

@ ఇంటింటా రుస రుసలు,
ఇరుగు పొరుగు  గుసగుసలు....!

@ రంకెలేసే కాడెద్దులు,
కాలు దువ్వే పందెం కోళ్ళు......! 

@ ఆట పాటల తిరునాళ్ళు,
ఆటలాడే పేకాట రాయళ్ళు......!

@ పగలంతా భజన తాళం,
రాతిరైతే బోగం మేళం.......!

........... కళ్యాణ్  ;) 

Wishing A.R. Rahman sir a very Happy Birthday!! 6th january

to  A.R.RAHMAN ..... ;)


# 'Oscar' గెలిచిన సంగీతం నీది .,

# రేసు కారు లా ఝుమ్మను రాగం నీది .,

# దేశం గర్వించే 'VANDEMATHARA' గాయకుడా .,

# JAYA HOO గీతంతో లోకం గెలిచిన నాయకుడా .,

# 'ROJA' తో నీ మొదలైన కళా జీవనం .,

# విరామం ఎరుగక సాగుతున్న నీ ప్రయాణం ., 

# కుర్ర కారుకు నీ MUSIC యమ క్రేజు .,

# జనాల గుండెల్లో నీ పాటల హోరు .,

# వెన్నల చీకట్లు, ముస్తఫా పాటలు .,

# యుగళ గీతాలు, Youth కు హుషారు .,

# నీ Composing తీరు, Music కు కొత్త జోరు .,

# A.R.RAHMAN అంటే సంగీతం కు మారు పేరు .,


Wishing A.R.RAHMAN sir a very Happy Birthday !! ;) 

...........KALYAN ;)

Monday, December 29, 2014

KANULA ANDAM ;)

*నీ కళ్ళకు కాటుక అందం .,
*నీ నీలి కళ్ళ రూపు అందం .,
*నీ కంటి చూపు సైగ అందం .,
*నీ కనుల చాటు ఓర చూపు అందం .,
*నీ కళ్ళలో ఆ కైపు అందం .,
*నీ నిదుర కళ్ళ బాష అదో అందం .,
*పెదవమ్మా నవ్వుతుంటె - కనులమ్మకు అందం .,
*బుగ్గంతా ఎర్ర పడితె - కనుల లో కోపం అందం .,
*హరి విల్లు లాంటి కను బొమ్మలు అందం .,
*నిదురించే వేళ, నీ కంటి పాప అందం .,
*నీ కళ్ళలో, నా రూపం చూడటం అందం.,
*నీ కనుల పై నా కవిత అందం .,
*నీ కోసం రాసిన కవిత నువ్వు చదువుతుంటే,
నా కళ్ళలో కన్నీళ్లు అందం .,
*కాదు అది మాటలకు అందని ఆనందం.................!
.................. కళ్యాణ్

Wednesday, December 3, 2014

ontari gaa unna..! ootami tho unnaa..!

ఏ స్వప్న వేళలో, ఏ కాంతి దీపమో,
ఓ దారి చూపుతూ, తోడాయె నేస్తమై.,

కను తెరచి చూడగా, చీకట్లు కమ్ముతూ,
రహదారి మాయమై, విధి దూరమాయను.,

ఓ తార రాలితే - సుభమంటు నమ్మాను....!
ఓ తార చేరితే - చిత్రంగ చూసాను....!

మామూలు వాడినే, మనసంత మౌనమే,
కన్నీరు కారెనే, ఒక తోడు లేకను.,

ఏ దారి తోచక, నిలుచుండి  పోయాను,
ఏ తీరం చేరునో, ఈ జీవం చివరకు., 

ఒంటరి గా ఉన్నా....!
ఓటమి తో ఉన్నా....!

........... కళ్యాణ్ ;) 

emani raasiukonu kaavyam....!

ఏమని రాసుకోను కావ్యం ......!


రోజు గుర్తోస్తున్నావ్,

ఎప్పుడు ఏడిపిస్తున్నావ్,

నీ పై ప్రేమ ఇంకా చావటం లేదు,

నువ్వు  రావు అని తెలుసు,

కాని నా చిట్టి గుండె ఇంకా నీ ద్యాస లో నే ఆడుతుంది.


నీ ద్యాస లేక పోతే రోజు గడవదు.,

నీ ఊసు లేకుండా మాట పలకదు.,

నీ రూపు చూడకుండా రెప్ప వాలదు.,

నీ పేరు చెప్పకుండా పెదవి తడవదు.,


గుండె నిండా ఉన్న ప్రేమని,
గుప్పెట్లో దాచాను ...........!

అలలాగా నా జీవితంలోకి వచ్చి,
కలలాగ జ్ఞాపకాన్ని మిగిల్చావు ...........!

జాబిల్లిలా నీ కోసం రాత్రి అంతా వేచి ఉంటా ..........!
నా వెలుతురివై పగలంతా తోడుండి పో .........!

............. కళ్యాణ్  ;)