Friday, June 19, 2015

its you dear

పండగల్లె పరికిణి లో ,
నవ్వుతుంటే నెలవంక !

రాలిపోవ సిరి ముత్యాలు , 
ఏరుకోను ఈ జన్మ చాలు . 

అచ్చ తెలుగు అందం ,  
అమ్మాయి రూపం . 

నీలి కనుల వీక్షణం ,
వాలు కనుల వయ్యారం . 

ఎర్రటి నీ ఆధారాలు ,
ఆవడ లా నీ బుగ్గలు . 

ముద్దొచ్చే నీ పలుకులు , 
బుంగ మూతిలో నీ అలుకలు . 

శంఖమంటి మెడ, 
పూలతల వాలు జడ . 

పసిడి వన్నె పరువాలు , 
పరవశింప జేయి యవ్వనాలు. 

నడుము వంపు సోయగాలు , 
నీ సొంతం నెమలి నడకలు . 

నీ ఒడిలో దివి సీమ , 
నేను చేరితే కలవరమా ? 
కోటి కాంతుల పారిజాతమ , 
నా జన్మల పుణ్య ఫలమా... 

నీ ప్రేమకు బానిసని , 
కాదనకే దొరసాని ..! 

అంద చందాల యువ రాణి , 
నా ప్రేమ సామ్రాజ్యానికి నువ్వే 'మహా రాణి' .....! 

.... కళ్యాణ్ ;)    
నేల మీద వెన్నలమ్మ ...,
కాటుక కళ్ళ బాపు బొమ్మ ...,
లవ్ యు అంటూ కోయిలమ్మ ...,
సోయగాల బుంగ మూతి గుమ్మా ...,


Monday, June 15, 2015

AP schools reopens



ఆకతాయి వయసు వేళ అక్షరాల బాటలోన,
జీవితాన్ని చదవమంటు పుస్తకాలు మూసుకుంటు,
బుర్ర చూస్తే చిటికెడంత - బుర్ర లోకి భారమెంత ?

వస్తాదువా?
రెండెడ్ల బండివా ?
గోవర్ధన గిరిని మూసిన గూవిందుడివా ?

బడిలోకి వెళ్తున్నావా ?  పోరు బరిలోకి వెళ్తున్నావా ?
నిన్ను తీర్చి పంపుతున్న నీ తల్లికి వందనం.

కోరిన చదువులో ? ఎందుకూ కొరగాని చదువులో ?
నిన్ను ఆ స్తాయికి పెంచుతున్న నీ తండ్రికి వందనం.

ఉద్దేశాలను నీపై రుద్డక, ఉపన్యాసాల ఊసే లేక !
ఊపిరంతా నీ ఊహల సాకారం కోసం శ్రమించే నీ గురువుకి వందనం .

తోడుగా ఉంటావో ? తాడో పేడో అంటావో ?
స్నేహానికి సాటి రాదు ఏ బందం. ఆ అనుబందానికి వందనం.

విజయాన్ని అందుకునే వీర కిషోరమా !
విజయ లక్ష్మి నిను వరించు గాక.

.... కళ్యాణ్  ;) 

Friday, June 5, 2015

vijayam

విజయం ........! 

దారి ఏది లేదంటే ! దరికి రాదు ఏ విజయం, 
దారమొకటి కాదు కదా ? సూదితోనె రూపు సాద్యం. 

చీకటని తెలిసి కూడా వెతుకులాట దేనికి ? 
ఏదో ఒక చిరు మార్గం కోసమే నీ ప్రయత్నం. 

సాగనీ ఈ జీవితం, ఊరుకుంటే ఉత్తమం..! 
అని అనుకుంటే ఈ క్షణం, లేదు నీకు గమ్యం. 

యుద్దమందు వెనకుంటే, నిలుచు నీకు ప్రాణాలు. 
పోరాడితే ఒకసారి ఆ ప్రాణానికి దొరుకుతుంది చిరునామా. 

సాయం ఒకటి నీకుంటే సాదించవ ఎదైనా ! 
ఓ తోడు వెంటుంటే గెలువ గలవు ఎపుడైన ! 

పాట గానె కాదు ఇది పాటం గా చదువుకో.  
పాటలన్ని వల్లె వేస్తు జీవితాన్ని గెలుచుకో. 

........... కళ్యాణ్ ;)  

Thursday, June 4, 2015

it was the day

‪#‎it‬ was the day where I am alone,
#it was the day where I lost everything,
#it was the day where I cried for the first time,
#it was the day where i stopped dreaming,
#it was the day that i lost hopes,
#it was the day where i have no one to share,
#it was the day that I'm gonna stop complaining,
#it was the day where I have start to do anything which i don't want to.
#it was the day I'm writing from the heart without feelings,
#it was the day l felt to stop taking breath,
#it was the day proved that how unlucky i am,
#it was the day proved I am a big failure,
#it was the day where everyone stoped trusting me,
#it was the day where i stopped thinking abt my future,
#it was the only day that I'm alive with myself.
#it was my day, which i can NEVER forget. ;(
.....kalyan ..

what i am

WHAT I AM..... ?
i know what i am, but
i don't know what i want....!
i know my caliber, but
i don't know what I can give my best.....!
i know my capability, but
i don't know my boundaries.....!
i know my stands, but
i don't know where i have to stand exactly.....!
i know I'm ready to do anything, but
I'm not ready to accept that fact.....!
i know how to keep others happy, but
i really don't know how to be happy always.....!
i know how to cry, but
i don't know to make other's cry.....!
I KNOW,
I just know what I DON'T KNOW.....!