Monday, December 29, 2014

KANULA ANDAM ;)

*నీ కళ్ళకు కాటుక అందం .,
*నీ నీలి కళ్ళ రూపు అందం .,
*నీ కంటి చూపు సైగ అందం .,
*నీ కనుల చాటు ఓర చూపు అందం .,
*నీ కళ్ళలో ఆ కైపు అందం .,
*నీ నిదుర కళ్ళ బాష అదో అందం .,
*పెదవమ్మా నవ్వుతుంటె - కనులమ్మకు అందం .,
*బుగ్గంతా ఎర్ర పడితె - కనుల లో కోపం అందం .,
*హరి విల్లు లాంటి కను బొమ్మలు అందం .,
*నిదురించే వేళ, నీ కంటి పాప అందం .,
*నీ కళ్ళలో, నా రూపం చూడటం అందం.,
*నీ కనుల పై నా కవిత అందం .,
*నీ కోసం రాసిన కవిత నువ్వు చదువుతుంటే,
నా కళ్ళలో కన్నీళ్లు అందం .,
*కాదు అది మాటలకు అందని ఆనందం.................!
.................. కళ్యాణ్

Wednesday, December 3, 2014

ontari gaa unna..! ootami tho unnaa..!

ఏ స్వప్న వేళలో, ఏ కాంతి దీపమో,
ఓ దారి చూపుతూ, తోడాయె నేస్తమై.,

కను తెరచి చూడగా, చీకట్లు కమ్ముతూ,
రహదారి మాయమై, విధి దూరమాయను.,

ఓ తార రాలితే - సుభమంటు నమ్మాను....!
ఓ తార చేరితే - చిత్రంగ చూసాను....!

మామూలు వాడినే, మనసంత మౌనమే,
కన్నీరు కారెనే, ఒక తోడు లేకను.,

ఏ దారి తోచక, నిలుచుండి  పోయాను,
ఏ తీరం చేరునో, ఈ జీవం చివరకు., 

ఒంటరి గా ఉన్నా....!
ఓటమి తో ఉన్నా....!

........... కళ్యాణ్ ;) 

emani raasiukonu kaavyam....!

ఏమని రాసుకోను కావ్యం ......!


రోజు గుర్తోస్తున్నావ్,

ఎప్పుడు ఏడిపిస్తున్నావ్,

నీ పై ప్రేమ ఇంకా చావటం లేదు,

నువ్వు  రావు అని తెలుసు,

కాని నా చిట్టి గుండె ఇంకా నీ ద్యాస లో నే ఆడుతుంది.


నీ ద్యాస లేక పోతే రోజు గడవదు.,

నీ ఊసు లేకుండా మాట పలకదు.,

నీ రూపు చూడకుండా రెప్ప వాలదు.,

నీ పేరు చెప్పకుండా పెదవి తడవదు.,


గుండె నిండా ఉన్న ప్రేమని,
గుప్పెట్లో దాచాను ...........!

అలలాగా నా జీవితంలోకి వచ్చి,
కలలాగ జ్ఞాపకాన్ని మిగిల్చావు ...........!

జాబిల్లిలా నీ కోసం రాత్రి అంతా వేచి ఉంటా ..........!
నా వెలుతురివై పగలంతా తోడుండి పో .........!

............. కళ్యాణ్  ;) 

Sunday, November 16, 2014

oopiraagina , nee ooha aagadu......!

నీ కోసం ఓ రాత్రి మేలుకుంటా ......!

నీ ద్యాసలో ఓ పూట గడిపేస్తా......!

నువ్వు వస్తావని చచ్చే దాక ఎదురు చూస్తా.....!

పక్కన లేవని తెలిసినా పలకరిస్తా.....!

బాగా గుర్తొచ్చి ఏడుపోస్తే, ఇంకా బాగా నవ్వుకుంటా.....!

గుండె ఆగినా, గుండెలో నీ రూపం మాయదు.....!

ఊపిరాగినా, నీ ఊహ ఆగదు.......!


............... కళ్యాణ్  ;) 

Tuesday, November 11, 2014

nee madi lo chootu eeve.....!


గాలి లో నీ పరిమళం, వీచనే ఈ క్షణం.,

ఓ పువ్వుకే కలవరం, కలిగెనే ఓ క్షణం.,

అను దినం, నువ్వొక జ్ఞాపకం.,

ఏ చోటను చూసినా నువ్వనే వ్యాపకం.,

గాలుల్లో, నీలల్లో, ఆ నీలి మేఘాల్లో చూసాను నీ రూపం.,

నా మనసుకేమైందో....?
నీ చెలిమి కోరుతోందో....?

చెలి రూపు చూడగానే,
మనసంత మాయమాయె....!

నీ చేయి తగలగానె,
నిదురంత దూరమాయె .....!

నా ఊపిరాగు లోపు, 
నీ మదిలొ చోటు ఈవె.........! 



.......... కళ్యాణ్  ;) 

Saturday, October 25, 2014

devata....! _/\_

దేవత ................! _/\_

దేవత ఏ దిగి వచ్చి, స్వర్గాన్నే నిర్మించి.,

రాయి లాంటి నా మదిని, పూత పోసి శిల చేసి.,

పూజలందుకొమ్మంటూ, కోవెల లో నిలిపింది.,

ప్రేమతో మది చేరి, జీవితాన్ని మలిచింది.,

" * * * * * * * * * * * * * * * * * * "

తాను ఎదురు చూసే వేళ,
కనుల కంత సంక్రాంతి.,

తాను పలకరిస్తూ ఉంటే,
వెన్నలంట ప్రతి రాత్రి.,

తాను ఎదురు వచ్చే వేళ,
స్వాగతాల పూల దారి.,

తాను నవ్వుతుంటే చాలు,
సొంతమాయె ప్రతి రోజు.,

తాను నిదుర పోయే వేళ,
చల్ల గాలి పరవళ్ళు.,

" * * * * * * * * * * * * * "

దేవత,
నా జీవితానికే ఓ కానుక.,

దేవత,
నా మనసు లో మరు మల్లిక.,

దేవత,
నా కనుల లో చిరు దీపిక.,

" * * * * * * * * * * * * "

దేవత....!
ఓ దేవత......!

దేవత.....!
ఓహొఓఓ దేవత..........!

నా దేవత .........! _/\_


.................... కళ్యాణ్  ;)

Sunday, October 19, 2014

miss you

You may Leave ME., 
but I can LIVE with your Memories..........! 

Some day I may die without seeing YOU.,
but You can see ME laying Breathless..........!

only my dead body can prove that im not a Actor.,
(as im not acting love & care towards YOU) 
only these words may prove that im a good Writer........!

I wanna like to have a long & peaceful sleep.,
(as i didn't slept many nights in waiting 4 u)

I need a silent Mourning during my last morning., 
(bcoz i never saw a colorful morning with my wet eyes)

YOU never hurt-ed ME, but Your Memories did so.....!

I failed to do as U wished, but I  succeeded in my way & became a Failure with out YOU in my Life....! ;(



............ kalyan ;(