Thursday, May 7, 2015

palletoori enki

పల్లే టూరి ఎంకి,
కోడీ కూసె ఏల,
పిల్లా పైర గాలి,
పచ్చా వరీ చేలొ,
నీటీ ఊట కాడ,
కడవా నెత్తినెట్టి,
గల్లూ గల్లు మంటు,
మువ్వా సవ్వాడిల,
కుహూ కుహు మంటు,
కోకీలమ్మ లాగ,
చిలకా మాటలతో,
నెమలీ నడక తోటి,
పావు రాయి చూపు,
హంసా వంటి రూపు,
పొలము గట్టు ఎంట,
పాటా పాడుకుంట,
కొప్పూల జాజుల్లు దోపి,
వయ్యారి నడుమూను ఊపి,
చెంగు మంటు వేసేటి నడక,
ముక్కూన గుండ్రాని పుడక,
చెవులకు బంగారు దుద్దు,
నిలువెత్తు అందాన్ని చూడు,
ఓ పల్లెటూరి ఎంకి పిల్ల....!
అందమంత నీది మల్ల...!
చూసి కూడ ఆగేదేలా....? 

.............. కళ్యాణ్ ;) 

Friday, May 1, 2015

HAPPY MAY DAY

లాల్ సలాం కాంరేడ్స్ ''HAPPY MAY DAY''
కార్మిక సోదరులకు - '' మే డే '' శుభాకాంక్షలు
. . . . . . . . . . . . . . . . . . . . . . . . .
నా పదం అక్షర సత్యం,
నా రచన కల్ప వృక్షం,
నా కవితల అక్షయ పాత్రతో..,
కార్మిక సోదరులకు కనకాభి షేకం. . . . . !
.
పదం పాడి కదం తొక్కి ,
రధం లాగ జనం సాగగా.,
.
పలుగు , పార , నాగలి , నట్టు,
కొడవలి , కావలి, కష్టం, చమట,
మన నేస్తాలు...!
.
ప్రతి రైతు - రగిలే సూర్య ఖణం,
ప్రతి కాంరేడ్ - వెలిగే వేగు చుక్క,
ప్రతి కష్టం - కరిగే చమట చుక్క,
ప్రతి వ్రుత్తి - కనిపించే దైవం.,
.
బతుకు అంతా భారమై,
ప్రాణమున్న కష్ట జీవి,
గుప్పెడైన నీరు లేక,
వలస వెళ్లి పని కోసం,
అలసి పోయి విధి సైతం,
గుప్పెడు మట్టిని బదులిస్తే...!
.
రెక్కల బండిలో తిరిగే ఓ నేతన్నా....!
పేదల డొక్కల ఆకలి తీర్చన్నా....!
.
సువిశాల దేశమా.,
అన్నపూర్ణ భారతమా.,
కష్ట జీవిని ఆదుకోనుమా.......!
.
అడవి లోని 'అన్న'లకు,
అలసి పోయిన 'రైతన్న'లకు,
కష్టపడే 'కార్మికుల'కు,
అసువులు బాసిన 'అమర వీరుల'కు,
.
లాల్ సలాం.....! _/\_
.
........... కళ్యాణ్. 


Monday, April 27, 2015

SRUNGARA NYSHADAM

శ్రీనాధ కవి శృంగార నైషధం


Wednesday, April 1, 2015

train lo queen

ఒక రోజు రాత్రి నేను train  లో journey చేస్తూ ఉండగా..!
నా ముందు కూర్చున్న అమ్మాయి ని చూస్తూ రాసిన కవిత...!
. . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . .

రైలు లో style గా నువ్వలా కూర్చుంటే...!
సీటు పై చాటు గా window పై వాలి పోతూ...!
నీ సోయగాల scarf తీసి, charming face చూపి...!
hi అంటూ నాకు smile ఇస్తే....!
పడిపోయా - నే పడిపోయా....!

తిరుగుతున్న భూగోళం ఒక్క సారి ఆగిపోని..,
నీ చిరు నవ్వు చూస్తూ ఇలా ఉండి పోతా....!

సాగుతున్న ప్రయాణం ఒక్క సారి ఆగిపోని...,
నీ గలగలా మాట వింటు, life అంతా గడిపేస్తా....!

చెతిలోన స్వాతి book 'u.,
పెదవి కింద chewing gum 'u.,
కాలి కింద bata చెప్పు.,
cell లోన beta app.,

ఏమి తపసు చేసాయో...?
ఏమి వరము అడిగాయో...?

నీ కంటి కాజల్  -  చేతి bangle.,
నీ hand bag  -  నీ వేలి ring.,

ఎదైనా ఒకటై, ఒకరోజు నిన్నంటి బతికుంటే చాలునే...!
అది కల కాక నిజమైతే, జన్మంతా నిను వీడనే....!

ఏమయ్యా బ్రమ్హయ్యా రాసావో లేదో...?
రాసి ఉంటే ఈ chapter, తానే నా LIFE  PARTNER .... .!

........... కళ్యాణ్ ;) 

Saturday, March 28, 2015

sri ramanavami subhakankshalu ;)

on the occasion of SRI RAMA NAVAMI festival 

*కోదండ రామయా,
*మా అండ నీవయా,
*సీతమ్మ తోడు గా,
*చల్లంగ ఉండయా,
.
.
*అడవి అంతా సుందరం, వర్ణిస్తే మది మందిరం.,
*మొబ్బు చాటు జాబిలమ్మ, అందాల నీడలు....!
.
*కొండలమ్మ మీదిగా జాలువారు జలపాతం.,
*కొమ్మ చాటు కోయిలమ్మ, కుహు కుహు పాటలు....!
.
*తారలన్ని నేల రాలి చమకు మంటు మెరువగా.,
*మయూరమే వయారి గా నాట్యమాడు జాడలు....!
.
*సెలయేటి హొరులు, చేప పిల్ల జోరులు.,
.
*రామ చిలుక పలుకులు, బుడత ఉడత పరుగులు.,
.
*యవ్వనాల జింక పిల్ల, వనం అంతా ఉరుకులు.,
.
*కొండా కోనల్లో కాంతులు....!
*వానర సేనల కేరింతలు...!

........ కళ్యాణ్ ;) 

(రామాయణం లోని అరణ్య కాండ సమయం లో.,  ఆ శ్రీ రాముడే తమ తోడుగా ఉంటే ! అడవి ప్రాంతం మరుయు అక్కడి పశు పక్షాదులు ఎంత కోలాహలంగా అందంగా ఉంటుందో అని ఊహించి రాసుకున్న చిన్న ప్రయత్నం )  _/\_   

Thursday, March 5, 2015

OTHER'S (other than ME) ......!

OTHER'S (other than ME) ......! 

#LIFE‪ is all about wining and loosing.
*to win what you want to be ur self, YOU must loose ur other relations.

#LIFE is just about compromise.
*to win for others one must compromise themselves.

#LIFE is just Living.
*NO matter how big ur dream is, but for others you just have to live ur life.

#LIFE is just a journey.
*even though you r in many, can't became ONE among many just becoz of other's.

#LIFE of the another man, became other man choice.....! smile emoticon

hahahaha.......!

.................. KALYAN SRINIVAS SARMA : ( 

NAANNAA............! ;(

*సృష్టి లో అందమైన పదం "నాన్న" .,
*జీవితం లో మొదటి మిత్రుడు  నాన్న.,
 *బంధాలను అల్లిన పూల మాల నాన్న.,
*వేలు పట్టి నడిపించి, వేల సార్లు సంబరపడిన నాన్న.,
*ఓనమాలు నేర్పించి, ఒకటవస్తానంలో నిలిపింది నాన్న.,
*అమ్మకు బ్రహ్మకు మధ్యన వారధి నాన్న.,
*కంటి పాప నేనైతే, కనురెప్పగ కాపు కాచింది నాన్న., 
*కేరింతల ప్రాయం నుండి, కవ్వింతల పరువం వరకు తొలి గురువు నాన్న., 
*బాల్యంలో నీకొక ఆట బొమ్మ నాన్న.,
*యవ్వనంలో నీకు చేయూత నాన్న.,
*చివరి సమయంలో నీ భాద్యత నాన్న.,
*ఆలన, లాలన, పాలన లో కొలమానం చూపని నాన్న.,
*అన్నీ నువ్వే అయిన నాకు, నేడు అందకుండా వెళ్ళవు.....! :(

MISS YOU నాన్నా...........! ;(
RIP (05-03-2000)

............... కళ్యాణ్.,