Wednesday, October 17, 2018

DEEWALI KID

to
Thotti Gang Kids

ROCKET  లా దూసుకు పోయే చలాకీ తనం.,

భూ చక్రం లా రివ్వున తిరిగే అల్లరి పరుగులు.,

మతాబు కే కితాబు ఇచ్చే, నవ్వుల వెలుగులు.,

చిచ్చు బుడ్డి లాంటి కొంటె వయసు.,

ఒరేయ్ ఆంధ్రావాలా, you are equal to 1000వాళా.,

shock లిచ్చే current తీగ, సాగి పో రా యమ happy గ.,

సీమ టపాకాయ లాంటి నవ్వులు.,

అమ్మా నాన్న కళ్ళల్లో వెలిగించు ఆనంద దీపావళి కాంతులు.,


HAPPY & SAFE DIWALI to all Thotti Gang JUNIOR's
 (belated)

..........kalyan

SWAPNAm.... !


నిదుర పో నేస్తమా.,

మేఘాల మెత్తటి పరుపు పై., 

జాబిలమ్మ తలగడ గా., 

చుక్కలన్నీ దుప్పటి కాగా., 

ఆ చల్లటి లో., 

ఆకాశం అంచుల లో., 

నీ స్వప్నం చేరువ లో., 

హాయి గా నిదుర పో .........!


............. కళ్యాణ్  ;) 

మహా శివ రాత్రి శుభాకాంక్షలు ;)

అడ్డం గీతలు , నిలువు గీతలు.,  ఇవి మారుస్తయా బ్రహ్మ రాతలు .....!

మహా శివ రాత్రి శుభాకాంక్షలు  ;)

లాల్ సలాం.....! _/\_

లాల్ సలాం కాంరేడ్స్  ''HAPPY MAY DAY''
కార్మిక సోదరులకు - '' మే డే '' శుభాకాంక్షలు

నా పదం అక్షర సత్యం,
నా రచన కల్ప వృక్షం,
నా కవితల అక్షయ పాత్రతో..,
కార్మిక సోదరులకు కనకాభి షేకం. . . . . !

పదం పాడి కదం తొక్కి ,
రధం లాగ జనం సాగగా.,

పలుగు , పార , నాగలి , నట్టు,
కొడవలి , కావలి, కష్టం, చమట,
మన నేస్తాలు...!

ప్రతి రైతు - రగిలే సూర్య ఖణం,
ప్రతి కాంరేడ్ - వెలిగే వేగు చుక్క,
ప్రతి కష్టం - కరిగే చమట చుక్క,
ప్రతి వ్రుత్తి - కనిపించే దైవం.,

బతుకు అంతా భారమై,
ప్రాణమున్న కష్ట జీవి,
గుప్పెడైన నీరు లేక,
వలస వెళ్లి పని కోసం,
అలసి పోయి విధి సైతం,
గుప్పెడు మట్టిని బదులిస్తే...!

రెక్కల బండిలో తిరిగే ఓ నేతన్నా....!
పేదల డొక్కల ఆకలి తీర్చన్నా....!

సువిశాల దేశమా.,
అన్నపూర్ణ భారతమా.,
కష్ట జీవిని ఆదుకోనుమా.......!

అడవి లోని 'అన్న'లకు,
అలసి పోయిన 'రైతన్న'లకు,
కష్టపడే 'కార్మికుల'కు,
అసువులు బాసిన 'అమర వీరుల'కు,

లాల్ సలాం.....!  _/\_

........... కళ్యాణ్  

పల్లే టూరి ఎంకి,

పల్లే టూరి ఎంకి,
కోడీ కూసె ఏల,
పిల్లా పైర గాలి,
పచ్చా వరీ చేలొ,
నీటీ ఊట కాడ,
కడవా నెత్తినెట్టి,
గల్లూ గల్లు మంటు,
మువ్వా సవ్వాడిల,
కుహూ కుహు మంటు,
కోకీలమ్మ లాగ,
చిలకా మాటలతో,
నెమలీ నడక తోటి,
పావు రాయి చూపు,
హంసా వంటి రూపు,
పొలము గట్టు ఎంట,
పాటా పాడుకుంట,
కొప్పూల జాజుల్లు దోపి,
వయ్యారి నడుమూను ఊపి,
చెంగు మంటు వేసేటి నడక,
ముక్కూన గుండ్రాని పుడక,
చెవులకు బంగారు దుద్దు,
నిలువెత్తు అందాన్ని చూడు,
ఓ పల్లెటూరి ఎంకి పిల్ల....!
అందమంత నీది మల్ల...!
చూసి కూడ ఆగేదేలా....?

.............. కళ్యాణ్ ;) 

తల్లి లేదంటారు శివుడికి....!

తల్లి లేదంటారు శివుడికి, తల్లి లేదంటారు...,
.
తల్లి ఉంటె జడలట్లు కట్ట నిచ్చేన....?
తల్లి ఉంటె పులి తోలు చుట్ట నిచ్చేన....?
తల్లి ఉంటె విభూది రాయ నిచ్చేన....?
తల్లి ఉంటె స్మశానాన తిరగ నిచ్చేన....?
.
తల్లి లేదంటారు శివుడికి, తల్లి లేదంటారు...,
.
తల్లి లేని శివుడే అంతటి ఘనుడైతే....?
తల్లి ఉన్న శివుడు ఇంకెంతటి ఘనుడవునో....!
.
తల్లి లేదంటారు శివుడికి, తల్లి లేదంటారు...,
ఎంతటి శివుడైనా(దేవుడైనా) తల్లి తరువాతనే.

....... కళ్యాణ్ ;)
source 'unknown' 

అమ్మా...... నాదో చిన్న ఆశ....!

అమ్మా...... నాదో చిన్న ఆశ....!
.
నిన్ను చూడాలని ఆశ.,
నిన్ను చేరుకోవాలని ఆశ.,
నీతో మాట్లాడాలని ఆశ.,
నీ ఒడిలో నిదురపోవాలని ఆశ.,
నీ చేయి పట్టుకుని నడవాలని ఆశ.,
నీ నవ్వు చూడాలని ఆశ.,
నిన్ను గుండెలకు హత్తుకుని ఏడవాలని ఆశ., 
నీ ఆనందం కోసం ఎదైనా చేయాలి అని ఆశ.,
నీ దారిలో ఓ పువ్వై! నీకు ఎదురవ్వాలని ఆశ.,
నా కనులలో నీ రూపం చూడాలని ఆశ.,
నా జీవితానికి అర్థం నువ్వవ్వాలని ఆశ.,
నీ కోసం మళ్ళీ మళ్ళీ పుట్టాలని ఆశ.,
.
*నా కోసం ప్రతీ జన్మలో మా ''అమ్మ'' గా నువ్వే పుట్టాలని ఆశ....! _/\_

....... కళ్యాణ్ ;)

HAPPY MOTHER's DAY
అయినా తల్లి ని ప్రేమించడానికి ఒక రోజేమిటి? ఒక జన్మ కూడా తక్కువే........!

జీవితాన్ని గెలుచుకో

VIJAYAM.

#daari edi ledante dariki raadu a vijayam,
#daaramokati kaadu kada, sudi tho ne rupu sadyam.

#cheekatani telisi kuda vetukulata deniki,
#edo oka chiru maargam kosame aa prayatnam.

#saaga neei jeevitam, urukunte uttamam.,  
#ani anukunna ee kshanam, ledu neeku gamyam.

#yuddamandu venakunte, niluchu neeku pranalu,
#proradithe aa prananiki dorukunoka chirunama.

#saayamokati naakunte saadinchana edyna,
#nee todu naakunte gelava galanu epudyna.

#paata gane kaadu idi patam ga chaduvu ko,
#paatalani valle vesthu jeevitham lo gelichi po.

.......... chinna  

దారి ఏది లేదంటే ! దరికి రాదు ఏ విజయం, 
దారమొకటి కాదు కదా ? సూదితోనె రూపు సాద్యం. 

చీకటని తెలిసి కూడా వెతుకులాట దేనికి ? 
ఏదో ఒక చిరు మార్గం కోసమే నీ ప్రయత్నం. 

సాగనీ ఈ జీవితం, ఊరుకుంటే ఉత్తమం..! 
అని అనుకుంటే ఈ క్షణం, లేదు నీకు గమ్యం. 

యుద్దమందు వెనకుంటే, నిలుచు నీకు ప్రాణాలు. 
పోరాడితే ఒకసారి ఆ ప్రాణానికి దొరుకుతుంది చిరునామా. 

సాయం ఒకటి నీకుంటే సాదించవ ఎదైనా ! 
ఓ తోడు వెంటుంటే గెలువ గలవు ఎపుడైన ! 

పాట గానె కాదు ఇది పాటం గా చదువుకో.  
పాటలన్ని వల్లె వేస్తు జీవితాన్ని గెలుచుకో. 

........... కళ్యాణ్ ;)  

naa maha raani

it's you dear.

pandagalle parikini lo,                       పండగల్లె పరికిణి లో , 

navvutunte nela vanka,

raalipova siri mutyalu,
eeru konu ee janma chaalu,

achha telugu andam,
ammai roopam,

neeli kanula veekshanam,
vaalu kanula vayyaram,

errati nee adharaalu,
aava vada laanti buggalu

muddoche nee palukulu,
moothi tippithe avi alukalu,

sankhamanti meda,
poo latala vaalu jada,

pasidi vanne paruvaalu,
paravasimpa jeyu yavvanaalu,

nadumu vampula soyagam,
nemali nadakalu nee sontam,

nee odi loo divi seema,
nenu cherithe kalavaramaa,

koti kaantula paarijaatama,
naa janmala punya falamaa,

nee prema ku baanisa ni,
kaadanake dorasaani.

anda chandala yuva raani,
naa prema samraajyaniki nuvve maha raani...!

bramha bomma

ఏమయ్యా  బ్రహ్మయ్యా ! బొమ్మ లాగ చేశావు ?

బొమ్మలోడి(తండ్రి) చేతికి బేరమాడి ఇచ్చావు !

జీవితాన్ని వెల చేసి కొన్నది(కన్నది) ఓ బంధం !

బొమ్మకేమో రూపు ఇచ్చి, చక్కదిద్ది, ప్రాణమిస్తే !

ఆ జీవమిచ్చిన బందానికి(అమ్మ) ఏమివ్వగలను...?

...... _/\_ ......  5th AUGUST
(నాకు జన్మ ఇచ్చిన తల్లి తండ్రులకు నా వందనం )

..... కళ్యాణ్  ;) 

yedainaa cheppanaa ?


నన్ను ఏదోటి రాయమని అడిగావు !
ఏదైనా రాయటం ఎందుకు ?
యదలో ఉన్న నీ గురించే రాస్తున్నా...,
.
.
ఏదైనా చెప్పనా ?
నా ఎద నుండే చెప్పనా...?.
.
ఎదురుగా నీవుంటే !
మౌనం ఒక కావ్యం.....!
.
యడమ పక్క దాగుంటే !
గుండె సవ్వడి ఒక వేదం.....!
.
నా ప్రాణం నీవైతే !
నీ జీవం నేనవుతా......!
.
నా ఊపిరి నీవైతే ?
.
నీతోనే కడ దాకా !
నీలోనే కలిసుంటా.....!


.... కళ్యాణ్ ;) 

RAVI WEDS SUNANDA

నారుగారు వారి వరాల పంట...,
రాయని వారింట సిరుల మూట..,

సిగ్గులొలుకు వధువు చిరునవ్వులు....!
ముద్దులొలుకు వరుని పలకరింపులు....!

ఏనాటి కలనో ! ఈ రోజు నిజమై .,
ఏ జన్మ ఫలమో ! ఈ జంట ఒకటై .,
కోరుకున్న వరం, కలిపింది దైవం...!

'రవి' కాంతుల తేజస్సు వాడు...,
'సునంద' ఆనందాలకు తోడు...,

మీ కలలు పండిన గడియ నాడు...!
ఒక్కటిగా చేయి కలిపి నడుచు నేడు...!

మూడు ముళ్ళ బంధం తో .,
మీరిద్దరూ, ఒకటి గా ఉండాలి అని,
ఆకాంక్షిస్తూ ......,

...... మీ కళ్యాణ్  ;)