Sunday, May 10, 2015

talli ledantaaru sivudiki

తల్లి లేదంటారు శివుడికి, తల్లి లేదంటారు...,
.
తల్లి ఉంటె జడలట్లు కట్ట నిచ్చేన....?
తల్లి ఉంటె పులి తోలు చుట్ట నిచ్చేన....?
తల్లి ఉంటె విభూది రాయ నిచ్చేన....?
తల్లి ఉంటె స్మశానాన తిరగ నిచ్చేన....?
.
తల్లి లేదంటారు శివుడికి, తల్లి లేదంటారు...,
.
తల్లి లేని శివుడే అంతటి ఘనుడైతే....?
తల్లి ఉన్న శివుడు ఇంకెంతటి ఘనుడవునో....!
.
తల్లి లేదంటారు శివుడికి, తల్లి లేదంటారు...,
ఎంతటి శివుడైనా(దేవుడైనా) తల్లి తరువాతనే.

....... కళ్యాణ్ ;)
source 'unknown' 

AMMA KOSAM naa aasa

అమ్మా...... నాదో చిన్న ఆశ....!
.
నిన్ను చూడాలని ఆశ.,
నిన్ను చేరుకోవాలని ఆశ.,
నీతో మాట్లాడాలని ఆశ.,
నీ ఒడిలో నిదురపోవాలని ఆశ.,
నీ చేయి పట్టుకుని నడవాలని ఆశ.,
నీ నవ్వు చూడాలని ఆశ.,
నిన్ను గుండెలకు హత్తుకుని ఏడవాలని ఆశ.,
నీ ఆనందం కోసం ఎదైనా చేయాలి అని ఆశ.,
నీ దారిలో ఓ పువ్వై! నీకు ఎదురవ్వాలని ఆశ.,
నా కనులలో నీ రూపం చూడాలని ఆశ.,
నా జీవితానికి అర్థం నువ్వవ్వాలని ఆశ.,
నీ కోసం మళ్ళీ మళ్ళీ పుట్టాలని ఆశ.,
.
*నా కోసం ప్రతీ జన్మలో మా ''అమ్మ'' గా నువ్వే పుట్టాలని ఆశ....! _/\_

....... కళ్యాణ్ ;)

HAPPY MOTHER's DAY
అయినా తల్లి ని ప్రేమించడానికి ఒక రోజేమిటి? ఒక జన్మ కూడా తక్కువే........!


Thursday, May 7, 2015

aatreya gaari bday

'' ఆచార్య ఆత్రేయ '' _/\_

'మనసుకవి' కి జన్మదిన సుమాంజలి .....! :) 

palletoori enki

పల్లే టూరి ఎంకి,
కోడీ కూసె ఏల,
పిల్లా పైర గాలి,
పచ్చా వరీ చేలొ,
నీటీ ఊట కాడ,
కడవా నెత్తినెట్టి,
గల్లూ గల్లు మంటు,
మువ్వా సవ్వాడిల,
కుహూ కుహు మంటు,
కోకీలమ్మ లాగ,
చిలకా మాటలతో,
నెమలీ నడక తోటి,
పావు రాయి చూపు,
హంసా వంటి రూపు,
పొలము గట్టు ఎంట,
పాటా పాడుకుంట,
కొప్పూల జాజుల్లు దోపి,
వయ్యారి నడుమూను ఊపి,
చెంగు మంటు వేసేటి నడక,
ముక్కూన గుండ్రాని పుడక,
చెవులకు బంగారు దుద్దు,
నిలువెత్తు అందాన్ని చూడు,
ఓ పల్లెటూరి ఎంకి పిల్ల....!
అందమంత నీది మల్ల...!
చూసి కూడ ఆగేదేలా....? 

.............. కళ్యాణ్ ;) 

Friday, May 1, 2015

HAPPY MAY DAY

లాల్ సలాం కాంరేడ్స్ ''HAPPY MAY DAY''
కార్మిక సోదరులకు - '' మే డే '' శుభాకాంక్షలు
. . . . . . . . . . . . . . . . . . . . . . . . .
నా పదం అక్షర సత్యం,
నా రచన కల్ప వృక్షం,
నా కవితల అక్షయ పాత్రతో..,
కార్మిక సోదరులకు కనకాభి షేకం. . . . . !
.
పదం పాడి కదం తొక్కి ,
రధం లాగ జనం సాగగా.,
.
పలుగు , పార , నాగలి , నట్టు,
కొడవలి , కావలి, కష్టం, చమట,
మన నేస్తాలు...!
.
ప్రతి రైతు - రగిలే సూర్య ఖణం,
ప్రతి కాంరేడ్ - వెలిగే వేగు చుక్క,
ప్రతి కష్టం - కరిగే చమట చుక్క,
ప్రతి వ్రుత్తి - కనిపించే దైవం.,
.
బతుకు అంతా భారమై,
ప్రాణమున్న కష్ట జీవి,
గుప్పెడైన నీరు లేక,
వలస వెళ్లి పని కోసం,
అలసి పోయి విధి సైతం,
గుప్పెడు మట్టిని బదులిస్తే...!
.
రెక్కల బండిలో తిరిగే ఓ నేతన్నా....!
పేదల డొక్కల ఆకలి తీర్చన్నా....!
.
సువిశాల దేశమా.,
అన్నపూర్ణ భారతమా.,
కష్ట జీవిని ఆదుకోనుమా.......!
.
అడవి లోని 'అన్న'లకు,
అలసి పోయిన 'రైతన్న'లకు,
కష్టపడే 'కార్మికుల'కు,
అసువులు బాసిన 'అమర వీరుల'కు,
.
లాల్ సలాం.....! _/\_
.
........... కళ్యాణ్.