Monday, December 29, 2014

KANULA ANDAM ;)

*నీ కళ్ళకు కాటుక అందం .,
*నీ నీలి కళ్ళ రూపు అందం .,
*నీ కంటి చూపు సైగ అందం .,
*నీ కనుల చాటు ఓర చూపు అందం .,
*నీ కళ్ళలో ఆ కైపు అందం .,
*నీ నిదుర కళ్ళ బాష అదో అందం .,
*పెదవమ్మా నవ్వుతుంటె - కనులమ్మకు అందం .,
*బుగ్గంతా ఎర్ర పడితె - కనుల లో కోపం అందం .,
*హరి విల్లు లాంటి కను బొమ్మలు అందం .,
*నిదురించే వేళ, నీ కంటి పాప అందం .,
*నీ కళ్ళలో, నా రూపం చూడటం అందం.,
*నీ కనుల పై నా కవిత అందం .,
*నీ కోసం రాసిన కవిత నువ్వు చదువుతుంటే,
నా కళ్ళలో కన్నీళ్లు అందం .,
*కాదు అది మాటలకు అందని ఆనందం.................!
.................. కళ్యాణ్

Wednesday, December 3, 2014

ontari gaa unna..! ootami tho unnaa..!

ఏ స్వప్న వేళలో, ఏ కాంతి దీపమో,
ఓ దారి చూపుతూ, తోడాయె నేస్తమై.,

కను తెరచి చూడగా, చీకట్లు కమ్ముతూ,
రహదారి మాయమై, విధి దూరమాయను.,

ఓ తార రాలితే - సుభమంటు నమ్మాను....!
ఓ తార చేరితే - చిత్రంగ చూసాను....!

మామూలు వాడినే, మనసంత మౌనమే,
కన్నీరు కారెనే, ఒక తోడు లేకను.,

ఏ దారి తోచక, నిలుచుండి  పోయాను,
ఏ తీరం చేరునో, ఈ జీవం చివరకు., 

ఒంటరి గా ఉన్నా....!
ఓటమి తో ఉన్నా....!

........... కళ్యాణ్ ;) 

emani raasiukonu kaavyam....!

ఏమని రాసుకోను కావ్యం ......!


రోజు గుర్తోస్తున్నావ్,

ఎప్పుడు ఏడిపిస్తున్నావ్,

నీ పై ప్రేమ ఇంకా చావటం లేదు,

నువ్వు  రావు అని తెలుసు,

కాని నా చిట్టి గుండె ఇంకా నీ ద్యాస లో నే ఆడుతుంది.


నీ ద్యాస లేక పోతే రోజు గడవదు.,

నీ ఊసు లేకుండా మాట పలకదు.,

నీ రూపు చూడకుండా రెప్ప వాలదు.,

నీ పేరు చెప్పకుండా పెదవి తడవదు.,


గుండె నిండా ఉన్న ప్రేమని,
గుప్పెట్లో దాచాను ...........!

అలలాగా నా జీవితంలోకి వచ్చి,
కలలాగ జ్ఞాపకాన్ని మిగిల్చావు ...........!

జాబిల్లిలా నీ కోసం రాత్రి అంతా వేచి ఉంటా ..........!
నా వెలుతురివై పగలంతా తోడుండి పో .........!

............. కళ్యాణ్  ;)