Monday, December 29, 2014

KANULA ANDAM ;)

*నీ కళ్ళకు కాటుక అందం .,
*నీ నీలి కళ్ళ రూపు అందం .,
*నీ కంటి చూపు సైగ అందం .,
*నీ కనుల చాటు ఓర చూపు అందం .,
*నీ కళ్ళలో ఆ కైపు అందం .,
*నీ నిదుర కళ్ళ బాష అదో అందం .,
*పెదవమ్మా నవ్వుతుంటె - కనులమ్మకు అందం .,
*బుగ్గంతా ఎర్ర పడితె - కనుల లో కోపం అందం .,
*హరి విల్లు లాంటి కను బొమ్మలు అందం .,
*నిదురించే వేళ, నీ కంటి పాప అందం .,
*నీ కళ్ళలో, నా రూపం చూడటం అందం.,
*నీ కనుల పై నా కవిత అందం .,
*నీ కోసం రాసిన కవిత నువ్వు చదువుతుంటే,
నా కళ్ళలో కన్నీళ్లు అందం .,
*కాదు అది మాటలకు అందని ఆనందం.................!
.................. కళ్యాణ్

Wednesday, December 3, 2014

ontari gaa unna..! ootami tho unnaa..!

ఏ స్వప్న వేళలో, ఏ కాంతి దీపమో,
ఓ దారి చూపుతూ, తోడాయె నేస్తమై.,

కను తెరచి చూడగా, చీకట్లు కమ్ముతూ,
రహదారి మాయమై, విధి దూరమాయను.,

ఓ తార రాలితే - సుభమంటు నమ్మాను....!
ఓ తార చేరితే - చిత్రంగ చూసాను....!

మామూలు వాడినే, మనసంత మౌనమే,
కన్నీరు కారెనే, ఒక తోడు లేకను.,

ఏ దారి తోచక, నిలుచుండి  పోయాను,
ఏ తీరం చేరునో, ఈ జీవం చివరకు., 

ఒంటరి గా ఉన్నా....!
ఓటమి తో ఉన్నా....!

........... కళ్యాణ్ ;) 

emani raasiukonu kaavyam....!

ఏమని రాసుకోను కావ్యం ......!


రోజు గుర్తోస్తున్నావ్,

ఎప్పుడు ఏడిపిస్తున్నావ్,

నీ పై ప్రేమ ఇంకా చావటం లేదు,

నువ్వు  రావు అని తెలుసు,

కాని నా చిట్టి గుండె ఇంకా నీ ద్యాస లో నే ఆడుతుంది.


నీ ద్యాస లేక పోతే రోజు గడవదు.,

నీ ఊసు లేకుండా మాట పలకదు.,

నీ రూపు చూడకుండా రెప్ప వాలదు.,

నీ పేరు చెప్పకుండా పెదవి తడవదు.,


గుండె నిండా ఉన్న ప్రేమని,
గుప్పెట్లో దాచాను ...........!

అలలాగా నా జీవితంలోకి వచ్చి,
కలలాగ జ్ఞాపకాన్ని మిగిల్చావు ...........!

జాబిల్లిలా నీ కోసం రాత్రి అంతా వేచి ఉంటా ..........!
నా వెలుతురివై పగలంతా తోడుండి పో .........!

............. కళ్యాణ్  ;) 

Sunday, November 16, 2014

oopiraagina , nee ooha aagadu......!

నీ కోసం ఓ రాత్రి మేలుకుంటా ......!

నీ ద్యాసలో ఓ పూట గడిపేస్తా......!

నువ్వు వస్తావని చచ్చే దాక ఎదురు చూస్తా.....!

పక్కన లేవని తెలిసినా పలకరిస్తా.....!

బాగా గుర్తొచ్చి ఏడుపోస్తే, ఇంకా బాగా నవ్వుకుంటా.....!

గుండె ఆగినా, గుండెలో నీ రూపం మాయదు.....!

ఊపిరాగినా, నీ ఊహ ఆగదు.......!


............... కళ్యాణ్  ;) 

Tuesday, November 11, 2014

nee madi lo chootu eeve.....!


గాలి లో నీ పరిమళం, వీచనే ఈ క్షణం.,

ఓ పువ్వుకే కలవరం, కలిగెనే ఓ క్షణం.,

అను దినం, నువ్వొక జ్ఞాపకం.,

ఏ చోటను చూసినా నువ్వనే వ్యాపకం.,

గాలుల్లో, నీలల్లో, ఆ నీలి మేఘాల్లో చూసాను నీ రూపం.,

నా మనసుకేమైందో....?
నీ చెలిమి కోరుతోందో....?

చెలి రూపు చూడగానే,
మనసంత మాయమాయె....!

నీ చేయి తగలగానె,
నిదురంత దూరమాయె .....!

నా ఊపిరాగు లోపు, 
నీ మదిలొ చోటు ఈవె.........! 



.......... కళ్యాణ్  ;) 

Saturday, October 25, 2014

devata....! _/\_

దేవత ................! _/\_

దేవత ఏ దిగి వచ్చి, స్వర్గాన్నే నిర్మించి.,

రాయి లాంటి నా మదిని, పూత పోసి శిల చేసి.,

పూజలందుకొమ్మంటూ, కోవెల లో నిలిపింది.,

ప్రేమతో మది చేరి, జీవితాన్ని మలిచింది.,

" * * * * * * * * * * * * * * * * * * "

తాను ఎదురు చూసే వేళ,
కనుల కంత సంక్రాంతి.,

తాను పలకరిస్తూ ఉంటే,
వెన్నలంట ప్రతి రాత్రి.,

తాను ఎదురు వచ్చే వేళ,
స్వాగతాల పూల దారి.,

తాను నవ్వుతుంటే చాలు,
సొంతమాయె ప్రతి రోజు.,

తాను నిదుర పోయే వేళ,
చల్ల గాలి పరవళ్ళు.,

" * * * * * * * * * * * * * "

దేవత,
నా జీవితానికే ఓ కానుక.,

దేవత,
నా మనసు లో మరు మల్లిక.,

దేవత,
నా కనుల లో చిరు దీపిక.,

" * * * * * * * * * * * * "

దేవత....!
ఓ దేవత......!

దేవత.....!
ఓహొఓఓ దేవత..........!

నా దేవత .........! _/\_


.................... కళ్యాణ్  ;)

Sunday, October 19, 2014

miss you

You may Leave ME., 
but I can LIVE with your Memories..........! 

Some day I may die without seeing YOU.,
but You can see ME laying Breathless..........!

only my dead body can prove that im not a Actor.,
(as im not acting love & care towards YOU) 
only these words may prove that im a good Writer........!

I wanna like to have a long & peaceful sleep.,
(as i didn't slept many nights in waiting 4 u)

I need a silent Mourning during my last morning., 
(bcoz i never saw a colorful morning with my wet eyes)

YOU never hurt-ed ME, but Your Memories did so.....!

I failed to do as U wished, but I  succeeded in my way & became a Failure with out YOU in my Life....! ;(



............ kalyan ;( 

Sunday, September 28, 2014

NENU Naa Gnaapakam........!

నేను నా  జ్ఞాపకం ..........!

నేను రాసుకున్న కావ్యం.,
నేను ఊహించిన రూపం.,
నేను తలుచుకునే నామం.,

నేను చూసుకున్న మార్ఘం.,
నేను దాచుకున్న జ్ఞాపకం.,
నేను కలగన్న ఓ స్వప్నం.,

నేను నా ఆశలు కావు శాశ్వతం.,
నేను ఒంటరి వాడిని, అది నా శాపం.,
నేను నేను గా మిగిలి పోయిన జీవితం.,

నేను నువ్వు కలిస్తేనే మనం.,
నేను నువ్వు కలసి ఉన్న ఆ గతం.,
నేను నువ్వు కలవడం ఓ వరం.,

నేను లేనని నువ్వు చెప్పిన ఆ క్షణం.,
నేను బతకడం కన్నా మరణమే నయం.,
నేను చేస్తన్నా నీకిది అంకితం........!


...............కళ్యాణ్  ;)

Thursday, September 25, 2014

FOR YOU BABY....!

for u baby



 *  నేస్తమై నీ వెంటుంటా.... !   నీడనై నీ తోడుంటా.... !

 *  నీ ఊహలో నేనుంటే ...! నా ఊపిరి లో నీవుంటావ్...!

 * నా ప్రేమ నిజం , నా బాధ నిజం , నా ఆరాధనా నిజం , నాలో నువ్వున్నది నిజం .... !

 *  నా గుండె ఇంకా ఆగి పోలేదు, ఎందుకంటే నీ మీద ప్రేమ ఇంకా ఆగిపోలేదు కనుక... !

 * కనుల లో నీవుంటే కన్నీటి తో కావ్యం రాస్తా.... ! నీ గులాం నై గుండెల్లో కొలువుంటా  ....!

 * ఒంటరి గా ఉన్నా , ఓటమి తో ఉన్నా ,  నీకు దూరంగా ఉన్నా , కాని నీ ద్యాస తో బతికున్నా... !





 * నీ పంచ ప్రాణాలు నేనైతే , నా ఆరో ప్రాణం నీవు.....!


 * విడిచి పోయినా పరవా లేదు , మరచి పోకు నేస్తమా ...!



 .............కళ్యాణ్  ;)

Monday, September 8, 2014

muddu........,



ముద్దు ..........!

 * నుదుటి పై ప్రేమ ముద్దు .,

 * కంటి పై కమ్మని ముద్దు .,

 * బుగ్గ పై హాయి ముద్దు .,

 * చెంప పై చక్కని ముద్దు.,

 * పెదవి పై చిరు ముద్దు .,

 * చెవి పై చిలిపి ముద్దు .,

 * మెడ పై అందమైన ముద్దు .,

 ............................................

  * * చెంప పై చెరగని ముద్దు.,

 * నుదుటి పై చెరగని ముద్దు.,

 * మెడ పై మైకం పుట్టించే ముద్దు., 


...................... కళ్యాణ్  ;)

Friday, August 29, 2014

naaa praanamaa..... !

నీ కోసం ఎదురు చూస్తూ , ఎదురైన ఎన్నో గాయాలను బరించా ....!

నిదుర లేని రాత్రులెన్నో , కుదురు లేని మెలుకువలు ఎన్నో .....!

నీ కోసం దేనికి అదర లేదు , ఎవరికీ బెదర లేదు .....!

వచ్చావు అనుకుని చూసా , బదులిస్తావు అని వేచి చూసా .....!

నిన్నే ఆరాదిస్తున్నా , నీ కోసమే నిత్యం రోధిస్తున్నా ....!

నీ కోసం నేను ఉన్నాను , కేవలం నీవున్నవనే ఈ లోకంలో ఉన్నాను .....!

నా ప్రాణమా .......!.......  నా గుండె ఆగే లోపు బదులిస్తావా .... ?



..................... కళ్యాణ్ ;)

Tuesday, July 15, 2014

u r not with me , but ur memories r....,

నా నెలవుంటావనుకున్నా! ఇపుడు సెలవంటావా  ప్రియతమా ?

నాతో కదిలోస్తావనుకున్నా! ఇపుడు వదిలెలుతున్నవా ప్రాణమా ?

కలలో ఓ పగలు, నిదుర రాని రాతురులు, నీ ద్యాసే రే పగలు..... !

వరాల సిరివే, జవరాల నారివే, నీ స్వరమే నాకు వరమే !

ఆ తారలు రాలనీ, ఈ తరాలు మారనీ, రణాలు జరగనీ, మరణం రానీ !

'' అమరం అయినా మరువను నీ స్మరణం ''........... !   ;( 





..... కళ్యాణ్

Wednesday, July 9, 2014

వర్షం లో తడిసినప్పుడు ఏడిస్తే ఆ కన్నీళ్ళు కనిపీయవు అంటారు .....,
కాని ఆ కన్నీళ్ళే జలపాతం లా మారినా ! నీకు కనపడదా ...... ?


................ కళ్యాణ్ 
నీ కనుల లోని కమ్మని భావములకు అర్థమేమి ప్రియా.............? 
.
.
.
కవితా ప్రియుడనే కాదు, కాంతా ప్రియుడను కూడా.....!





............ కళ్యాణ్ 

Thursday, July 3, 2014

my heart


నువ్వు జ్ఞాపకమొస్తే - నా గుండె ఆడుతుంది..,

నువ్వు జ్ఞాపకం గా మిగిలిన నాడు - నా గుండె ఆగుతుంది...,



................ కళ్యాణ్ 

Tuesday, July 1, 2014

కంటి లో కన్నీరు,
పెదవి పై చిరునవ్వు,
మనసు లో బాధ,
కడుపు లో ఆకలి.,

ఆకలి బాధలు కావివి - నా విరహ ప్రేమకు సాక్షాలు .... !



................ కళ్యాణ్ 

Monday, June 30, 2014

be a memory

నీ యడబాటు- అగ్ని జ్వాలలా నా హృదయాన్ని కాల్చినప్పుడు, నా కన్నీటితో ఆర్పుకున్నాను.....!

  నా కన్నులలో నీ ప్రతి రూపం కన్నీరు గా జారినప్పుడు, అర చేతి తో పట్టుకుని నీ రూపం మళ్ళీ చూసి                   ఆనందించాను .....!

   పక్కన నే  ఉన్నా పలకరీయలేక, నా ఎడమ పక్కన <3 ఎన్నో మాటలు దాచాను....!

   మాటి మాటికి గుర్తోస్తున్నావ్, <3 ఆడమంటావా ! ఆగమంటావా ! అని గుండె గుబులు పడుతోంది.....!

   దూరంగా ఉన్నా, దూరం అయినా., నా హృదయానికి దెగ్గరగా '' జ్ఞాపకం గా అయినా ఉండిపో ''......!


......... కళ్యాణ్  ;)

Saturday, June 28, 2014

నీ రూపం చూస్తుంటే నిదుర రాదు..,

 కనులు నీ బరువు మోస్తుంటే అలసట లేదు .... !


  ............. కళ్యాణ్ ;) 

Wednesday, June 25, 2014

when we lost every moment

నీ కురుల సువాసన జాడ లెదు..,

నీ కను చూపుల చిరు సైగలు కాన రావు..,

నీ చిరు నవ్వుల కోర పెదవి ఫై మాట లేదు..,

నీ కంటం పై ముద్దులొలికే తీయటి పలుకుల పిలుపు లేదు..,

దేహానికి దాహం తీర్చు నీ కౌగిలి మూటల సిరి లేదు..,

నడుమును చుట్టేసి బిడియంతో ఉన్న ఆ గడియ జాడ లేదు..,

నీ గజ్జల పాదాలకు ఆ బుజ్జి ముద్దులు లేవు..,

నువ్వు లేకుండా నేను లేను..,
.
.
.
.
.
.

కేవలం నీ జ్ఞాపకాలతో బ్రతక లేను ............!




................. కళ్యాణ్  ;)

Tuesday, June 24, 2014

nestamaa..., nee istam .......!

* నీ ఎడబాటును నా యద బరించలేకుంది..,

  నన్ను నువ్వు విడిచి పొతే, నా ప్రాణం నన్ను విడిచిందా అనిపిస్తుంది..,

  సూన్యం లో సైతం నీ సైనం లా వెంట ఉంటా.........,


  నేస్తమా ....!

  విధి లా నా వెంట ఉంటావో.... ?  
  విదిలించుకుని వెలుతుంటావో.... ? 

   నీ ఇష్టం ......! ;(



.......... కళ్యాణ్ ;) 

Monday, June 23, 2014

Everything I Do - I Do It For You

Look into my eyes – you will see What you mean to me.
Search your heart, search your soul And when you find me there you'll search no more.

"Everything I Do - I Do It For You"

................ (*******) ;(

Sunday, June 22, 2014

manasunna manishi ki SUKHAMU ledanthe...!


MANASUKAWI

''మనసుకవి'' : మనసు కు అవి = (జ్ఞాపకాలు)
for those who lost/missed their beloved person's once in their life's.....! ;(

మనకు ఇష్టమైన మనిషి దూరం అయ్యాక మనసుకు మిగిలేది వాళ్ళ జ్ఞాపకాలే !
అలా నా మనసు లోంచి వచ్చిన కొన్ని భావాలను తనకు అంకితం చేస్తూ....!

మనసుకవి.......!