Tuesday, December 18, 2018

Kanula Pai kavitha

Nee kanula Pai Kavitha raaya kalamedi saripodu ,

Nee chupukai eduru chuda
oo janmaina saripodu ,

Nee navvula sarigama loo
Nemali naatyamaadadaa !

Nee maatala gala gala laa
Selayeru paaradaa !

Nee Andamaina moomu chuda
Chandamaama Chinna Boda... !

Nee Andamaina manasu tellupa
Enni maatalaina takkuvega... !

...... MANASUKAWI ;)

Wednesday, October 17, 2018

DEEWALI KID

to
Thotti Gang Kids

ROCKET  లా దూసుకు పోయే చలాకీ తనం.,

భూ చక్రం లా రివ్వున తిరిగే అల్లరి పరుగులు.,

మతాబు కే కితాబు ఇచ్చే, నవ్వుల వెలుగులు.,

చిచ్చు బుడ్డి లాంటి కొంటె వయసు.,

ఒరేయ్ ఆంధ్రావాలా, you are equal to 1000వాళా.,

shock లిచ్చే current తీగ, సాగి పో రా యమ happy గ.,

సీమ టపాకాయ లాంటి నవ్వులు.,

అమ్మా నాన్న కళ్ళల్లో వెలిగించు ఆనంద దీపావళి కాంతులు.,


HAPPY & SAFE DIWALI to all Thotti Gang JUNIOR's
 (belated)

..........kalyan

SWAPNAm.... !


నిదుర పో నేస్తమా.,

మేఘాల మెత్తటి పరుపు పై., 

జాబిలమ్మ తలగడ గా., 

చుక్కలన్నీ దుప్పటి కాగా., 

ఆ చల్లటి లో., 

ఆకాశం అంచుల లో., 

నీ స్వప్నం చేరువ లో., 

హాయి గా నిదుర పో .........!


............. కళ్యాణ్  ;) 

మహా శివ రాత్రి శుభాకాంక్షలు ;)

అడ్డం గీతలు , నిలువు గీతలు.,  ఇవి మారుస్తయా బ్రహ్మ రాతలు .....!

మహా శివ రాత్రి శుభాకాంక్షలు  ;)

లాల్ సలాం.....! _/\_

లాల్ సలాం కాంరేడ్స్  ''HAPPY MAY DAY''
కార్మిక సోదరులకు - '' మే డే '' శుభాకాంక్షలు

నా పదం అక్షర సత్యం,
నా రచన కల్ప వృక్షం,
నా కవితల అక్షయ పాత్రతో..,
కార్మిక సోదరులకు కనకాభి షేకం. . . . . !

పదం పాడి కదం తొక్కి ,
రధం లాగ జనం సాగగా.,

పలుగు , పార , నాగలి , నట్టు,
కొడవలి , కావలి, కష్టం, చమట,
మన నేస్తాలు...!

ప్రతి రైతు - రగిలే సూర్య ఖణం,
ప్రతి కాంరేడ్ - వెలిగే వేగు చుక్క,
ప్రతి కష్టం - కరిగే చమట చుక్క,
ప్రతి వ్రుత్తి - కనిపించే దైవం.,

బతుకు అంతా భారమై,
ప్రాణమున్న కష్ట జీవి,
గుప్పెడైన నీరు లేక,
వలస వెళ్లి పని కోసం,
అలసి పోయి విధి సైతం,
గుప్పెడు మట్టిని బదులిస్తే...!

రెక్కల బండిలో తిరిగే ఓ నేతన్నా....!
పేదల డొక్కల ఆకలి తీర్చన్నా....!

సువిశాల దేశమా.,
అన్నపూర్ణ భారతమా.,
కష్ట జీవిని ఆదుకోనుమా.......!

అడవి లోని 'అన్న'లకు,
అలసి పోయిన 'రైతన్న'లకు,
కష్టపడే 'కార్మికుల'కు,
అసువులు బాసిన 'అమర వీరుల'కు,

లాల్ సలాం.....!  _/\_

........... కళ్యాణ్  

పల్లే టూరి ఎంకి,

పల్లే టూరి ఎంకి,
కోడీ కూసె ఏల,
పిల్లా పైర గాలి,
పచ్చా వరీ చేలొ,
నీటీ ఊట కాడ,
కడవా నెత్తినెట్టి,
గల్లూ గల్లు మంటు,
మువ్వా సవ్వాడిల,
కుహూ కుహు మంటు,
కోకీలమ్మ లాగ,
చిలకా మాటలతో,
నెమలీ నడక తోటి,
పావు రాయి చూపు,
హంసా వంటి రూపు,
పొలము గట్టు ఎంట,
పాటా పాడుకుంట,
కొప్పూల జాజుల్లు దోపి,
వయ్యారి నడుమూను ఊపి,
చెంగు మంటు వేసేటి నడక,
ముక్కూన గుండ్రాని పుడక,
చెవులకు బంగారు దుద్దు,
నిలువెత్తు అందాన్ని చూడు,
ఓ పల్లెటూరి ఎంకి పిల్ల....!
అందమంత నీది మల్ల...!
చూసి కూడ ఆగేదేలా....?

.............. కళ్యాణ్ ;) 

తల్లి లేదంటారు శివుడికి....!

తల్లి లేదంటారు శివుడికి, తల్లి లేదంటారు...,
.
తల్లి ఉంటె జడలట్లు కట్ట నిచ్చేన....?
తల్లి ఉంటె పులి తోలు చుట్ట నిచ్చేన....?
తల్లి ఉంటె విభూది రాయ నిచ్చేన....?
తల్లి ఉంటె స్మశానాన తిరగ నిచ్చేన....?
.
తల్లి లేదంటారు శివుడికి, తల్లి లేదంటారు...,
.
తల్లి లేని శివుడే అంతటి ఘనుడైతే....?
తల్లి ఉన్న శివుడు ఇంకెంతటి ఘనుడవునో....!
.
తల్లి లేదంటారు శివుడికి, తల్లి లేదంటారు...,
ఎంతటి శివుడైనా(దేవుడైనా) తల్లి తరువాతనే.

....... కళ్యాణ్ ;)
source 'unknown'